Wednesday, May 8, 2024

త‌గ్గుతోన్న బంగారం ధ‌ర‌-అదే బాట‌లో వెండి

బంగారం ధ‌ర‌లు గ‌త రెండు రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. జూలై 1న పసిడి రేటు పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 దిగివచ్చింది. దీంతో ఈ గోల్డ్ రేటు రూ. 50,890కు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం అయితే 10 గ్రాములకు రూ. 100 తగ్గుదలతో రూ. 46,650కు క్షీణించింది. గోల్డ్ రేటు 2 రోజులుగా తగ్గుతూనే ఉంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. బంగారం ధరలు తగ్గుతూ వస్తూ ఉంటే.. వెండి రేట్లు కూడా ఇదే దారిలో పయనించాయి. సిల్వర్ రేటు కేజీకి రూ. 200 తగ్గింది. రూ. 65,100కు క్షీణించింది. వెండి ధర మూడు రోజులుగా తగ్గుతూనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి రేటు ఏకంగా రూ.800 పడిపోయింది.

కేజీకి రూ. 58,600కు క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 100 తగ్గింది. రూ. 46,650కు క్షీణించింది. చెన్నైలో అయితే బంగారం ధర రూ. 50 తగ్గింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 46,780కు క్షీణించింది. కేజీ వెండి ధర రూ. 200 తగ్గింది. రూ. 65,100కు దిగి వచ్చింది.ముంబైలో బంగారం ధర రూ. 100 తగ్గింది. రూ. 46,650కు క్షీణించింది. 22 క్యారెట్లకు ఇది వర్తిస్తుంది. వెండి ధర కేజీకి రూ. 800 తగ్గుదలతో రూ. 58,600కు క్షీణించింది.బెంగళూరులో కూడా వెండి రేటు కేజీకి రూ. 200 మేర తగ్గింది. రూ. 65,100కు క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. రూ. 100 తగ్గుదలతో రూ. 46,670కు దిగివచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement