Thursday, May 2, 2024

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. పసిడి రేటు వరసగా రెండో రోజు పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 370 తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 48,990కు పడిపోయింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గుదలతో రూ. 44,900కు చేరింది. వెండి రేటు కూడా పసిడి దారిలో నడిచింది. వెండి ధర రూ. 500 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 65,700కు చేరింది.

ఇక, విజ‌య‌వాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,990 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,900గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ.65,700కి చేరింది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,330 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,050 గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 61,700 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,260కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,260 గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ.61,700కి చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement