Sunday, November 28, 2021

Gautam Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ.. ఆసియాలో అత్యంత కుబేరుడిగా కిరీటం

ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా గౌతమ్‌ అదానీ నిలిచారు. ఇప్పటి వరకు ఆసియా అపర కుబేరుడిగా ఉన్న రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీని దాటి గౌతమ్‌ అదానీ నెవంబర్ వన్ స్థానానికి చేరారు. గత ఏడాది కాలంలోనే అదానీ సంపద 55 బిలియన్‌ డాలర్లు పెరిగింది. అంటేదాదాపు రూ.4.12 లక్షల కోట్లు. రోజుకు రూ.1000 కోట్ల సంపాందించారు.


అదానీ గ్రూప్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ బుధవారం10 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ 14.91 లక్షల కోట్లకు దిగజారింది. అదానీ గ్రూప్ సంస్థలు బుధవారం స్థూల మార్కెట్ క్యాప్‌లో 12,000 కోట్ల రూపాయలు, నికర మార్కెట్ క్యాప్‌లో 4,250 కోట్ల రూపాయలు పెరిగాయి. దీంతో గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News