Wednesday, April 24, 2024

India Vs New Zealand: టాస్ గెలిచి బ్యాట్ పట్టిన టీమిండియా

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. కాన్పూరులోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరగనున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. టెస్టు సిరీస్‌ను కూడా దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది.

మరోవైపు, టెస్టు సిరీస్‌లో గెలిచి టీ20 సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ భావిస్తోంది. తొలి టెస్టును వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement