Wednesday, May 8, 2024

ఈ వారం థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న చిత్రాలు ఇవే

ప్ర‌తి శుక్ర‌వారం ప‌లు సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుండ‌టం ప‌రిపాటే. మ‌రి ఈ వారం ఏయే చిత్రాలు సంద‌డి చేయ‌నున్నాయో చూద్దాం. మే 6వ తేదీన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ .. ‘జయమ్మ పంచాయితీ’ ఉన్నాయి. అదే రోజున తాను కూడా వస్తున్నట్టుగా ‘భళా తందనాన’ కూడా రంగంలోకి దిగేసింది. విష్వక్సేన్ హీరోగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా రూపొందింది. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రుక్సార్ థిల్లాన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ బ్యూటీ మంచి మార్కులు కొట్టేసింది. ఇక గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో .. ‘ జయమ్మ పంచాయితీ’ పేరుతో సుమ రంగంలోకి దిగుతోంది. ఇక శ్రీవిష్ణు – కేథరిన్ జంటగా చైతన్య దంతులూరి రూపొందించిన ఈ సినిమా, వారాహి బ్యానర్ పై నిర్మితమైంది. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ వదిలిన లిరికల్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గరుడ రామ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement