Thursday, May 2, 2024

మే 6న థియేటర్ లో ‘భళా తందనాన’

యంగ్ హీరో శ్రీవిష్ణు – క్యూట్ బ్యూటీ కేథరిన్ జంటగా చైతన్య దంతులూరి రూపొందించిన సినిమా ‘భళా తందనాన’. వారాహి చలన చిత్రం బ్యానర్ లో రజనీ కొర్రపాటి ఈ చిత్రం నిర్మించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ వదిలిన లిరికల్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కేజీఎఫ్ లో గరుడగా నటించిన రామచంద్రరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. రేపు ఈ మూవీ ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని మొదటి రెండు లిరికల్ వీడియోలకు మంచి స్పందన లభించింది. వైవిధ్యమైన కథాంశాంతో తెరకెక్కిన ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు చైతన్య దంతులూరి చెప్పారు. ప్రస్తుతం ఈ వారం రోజులు మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement