Saturday, April 27, 2024

హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తున్న మాజీ పోలీస్ ఆఫీస‌ర్ .. ల‌క్ష‌ల్లో లైక్స్ .. ఏంటా క‌థ‌..

చ‌క్క‌టి గ‌వ‌ర్న‌మెంట్ జాబ్.. అది కూడా ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌క‌లిపించే పోలీస్ జాబ్ ..మ‌రి ఈ ఉద్యోగాన్ని ఎవ‌రైనా వ‌దులుకుంటారా.. కానీ ఈమె వ‌దిలుకుంది..కార‌ణం కూడా స‌రి అయిన‌దే అనిపిస్తోంది. మ‌రి మ్యాట‌ర్ లోకి వెళ్తే.. ఆమె వ‌య‌సు 36.. ఆమె పేరు లియాన్నే కార్.. కేవ‌లం లీవ్ తీసుకుంద‌న్న కార‌ణంతో ఆమెని అవ‌మానించారట‌.. దాంతో ఏకంగా పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. మ‌రి ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా.. హాట్ హాట్ ఫొటోల‌తో చెల‌రేగిపోతుంది ఈ మాజీ పోలీస్ ఆఫీస‌ర్.. అదేంటీ అనుకుంటున్నారా ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పుడీమె బాగా పాపుల‌ర్ అయింది. జాబ్ పోయిన కార‌ణాన్ని చెబుతూ తమ అభిప్రాయాలను కొందరు నిజాలుగా చిత్రీకరించాలని చూస్తారు. ఎవరు ఏ ఉద్యోగంలో ఉన్నా… వారిని అవమానిస్తే మాత్రం భరించలేరు. నాకు కూడా అందరిలాగే ట్రావెల్ చెయ్యడం ఇష్టం. నా లీవ్స్ నేను వాడుకోకూడదా… అని ప్రశ్నించింది .తనపై తప్పుడు ఆరోపణలు చెయ్యడం వల్లే తాను పోలీస్ డ్యూటీని వదిలేశానని తెలిపింది. “పోలీస్ కానిస్టేబుల్‌, పోలీస్ సర్జియంట్, పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా 14 ఏళ్లు పనిచేశాను. అది నాకు గర్వకారణం. ప్రజలకు సేవ చెయ్యడానికి ఎన్నో త్యాగాలు చేశాను. హార్డ్ వర్క్ చేశాను. నిబద్ధతతో పనిచేశాన‌ని వెల్ల‌డించింది.

లియాన్నే త‌ర‌చుగా ప‌లు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి ఆ ఫొటోలు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తుంటే… క్రమంగా ఫాలోయర్స్ సంఖ్య పెరుగుతుంది . ఇలా మూడేళ్లలో లక్ష మందికి చేరింది. ఇప్పుడు ఆమె ఏ పోస్టు పెట్టినా… దానికి వేలల్లో లైక్స్ వస్తున్నాయి.ఇంతలా లైక్స్ రావడానికి కారణం ఆమె చాలాసార్లు హాట్ ఫొటోలు పెడుతోంది. బికినీల్లో పోజులిస్తోంది. కాకపోతే… పోష్ ఏరియాలకు వెళ్లి… అక్కడ ఫొటోషూట్లు చేస్తోంది. అందువల్ల లైక్స్ పెరుగుతున్నాయి.అసలే మాజీ పోలీస్ కదా… ఆమె ఫిజిక్ చాలా స్ట్రాంగ్. టోన్డ్ బాడీ… ఫ్యాన్స్‌కి బాగా నచ్చుతోంది. వర్కవుట్లు ఎక్కువగా చేస్తోంది. అందువల్ల మంచి బాడీ ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తోంది.ఇప్పుడామె చాలా ఆనందంగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషనల్ యాడ్స్ చేసుకుంటూ సెలబ్రిటీ హోదా అనుభవిస్తోంది. ఇదివరకట్లా తాను పోలీస్‌గానే ఉండి ఉంటే… ఇంత పేరు వ‌చ్చేదే కాద‌ని నొక్కి వ‌క్కాణించి మ‌రీ చెబుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement