Saturday, April 27, 2024

ర‌ష్యా నుండి ర‌క్ష‌ణ కోసం – ఊరిని నీటితో నింపిన ఉక్రెయిన్ ప్ర‌జ‌లు

త‌మ దేశాన్ని కాపాడుకోవ‌డానికి ఉక్రెయిన్ ప్ర‌జ‌లు పెద్ద సాహ‌సాలే చేస్తున్నారు. అందులో భాగంగా ఊర్లను కావాలనే జనాలు వరదల్లో ముంచేస్తున్నారు. పొరుగున పారే నదుల్లో మోటార్లు వేసి నీటిని తోడి గ్రామాల్లోకి మళ్లిస్తున్నారు. అలాంటి ఘటనే రాజధాని కీవ్ కు సమీపంలోని దెమిదివ్ గ్రామంలో జరిగింది. రష్యా యుద్ధ ట్యాంకులు వెళ్లకుండా ఊరు మొత్తాన్ని గ్రామస్థులు వరద నీటితో ముంచేశారు. దినిప్రో నది నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడిపోస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా చేసిన దండయాత్ర కన్నా ఈ నష్టం కష్టం తమకు పెద్దదేమీ కాదని గ్రామస్థులు తల ఎత్తుకుని సగర్వంగా చెబుతున్నారు. రష్యాను మట్టికరిపించేందుకు ఏదైనా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఊరిని వరదల్లో ముంచేసినందుకు ఏ ఒక్కరికీ బాధ లేదని గ్రామస్థులు చెబుతున్నారు. రష్యా నుంచి తమ దేశాన్ని, ప్రాంతాన్ని, భూభాగాన్ని కాపాడుకునేందుకు ఇదో చిన్న ప్రయత్నమన్నారు. గత నెలలో వచ్చిన వరదల కారణంగా పలు ప్రాంతాల నుంచి రష్యా తన బలగాలను వెనక్కు రప్పించుకుంది. అంటే రష్యా వెనకడుగు వేయడంలో వరదలు కూడా సాయం చేశాయి. ఈ నేపథ్యంలోనే దెమిదివ్ గ్రామస్థులు ఉడుతాభక్తిగా తమ ఊరిని ముంచేసుకున్నారు. కాగా, ధైర్యం అనేది ఉక్రెయిన్ ప్రజల డీఎన్ఏల్లోనే ఉందని ఉక్రెయిన్ ప్రభుత్వాధికారి మిఖాయిలో ఫెడోరోవ్ చెప్పారు. ఊరిని వరదలతో ముంచేసిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement