Friday, May 10, 2024

గడ్డపోతారంలో చిరుతపులి హాల్ చల్

జిన్నారం: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత పులి కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి హెటిరో పరిశ్రమ ముందు నుండి చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆసమయంలో కార్మికులంతా విధుల్లో ఉన్నారు. పారిశ్రామికవాడలో పులి సంచారంతో కార్మికులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వెంటనే సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. పులి సంచరించిన ఆనవాళ్లు పరిశ్రమ ముందు గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు. పులి బెడద నుండి అటవీశాఖ అధికారులు రక్షణ కల్పించాలని కార్మికులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement