Saturday, April 27, 2024

కేజీఎస్ 3 ఉపగ్రహానికి.. నటుడు పునీత్ రాజ్ కుమార్ పేరు

కర్ణాటకలో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కి ఫ్యాన్​బేస్​ మామూలుగా ఉండదు. అప్పు కోసం ఏదైనా చేసేవారు కోకొల్లలు. ఈ జాబితాలో స్కూల్ విద్యార్థులు కూడా ఉన్నారు. తాజాగా.. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తాము రూపొందించిన కేజీఎస్‌3 శాట్‌కు దివంగత కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు పెట్టారు. దీనిని ఈ నెలాఖరులో తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ-సి54 వాహక నౌక ద్వారా పంపనున్నారు. ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement