Monday, May 6, 2024

Khammam: ఆర్ధిక సంస్కరణల పితామహుడు పీవీ : మంత్రి పువ్వాడ

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సందర్భాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కించిన గొప్ప నాయకుడు, సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహ రావు అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నేడు పీవీ 102వ జయంతి సందర్భంగా ఖమ్మం నగరం లాకారం సర్కిల్ నందు గల పీవీ విగ్రహానికి మంత్రి పువ్వాడ, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పీవీ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వారి సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తగినరీతిలో గౌరవిస్తుందన్నారు.పీవీ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, చిరుమామిళ్ళ లక్ష్మి, ఆళ్ళ నిరిషా అంజి రెడ్డి, రాపర్తి శరత్, కురాకుల వలరాజ్, RJC కృష్ణ, ఈశ్వర హరిబాబు, కొల్లు పద్మ, వనం కృష్ణవేణి, సతీష్, రవికాంత్, MA కరీం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement