Monday, May 13, 2024

మాజీ ప్రధాని మన్మోహన్‌కు కరోనా పాజిటివ్

భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మార్చి 4న మన్మోహన్ సింగ్​, ఆయన సతీమణి గుర్​శరణ్​​ కౌర్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకోవడం గమనార్హం. మరోవైపు దేశంలో కోవిడ్ తీవ్రమవుతోందని, నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొంటూ ఇటీవల మన్మోహన్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. దేశంలో ఉగ్రరూపం దాలుస్తున్న కరోనా సెకండ్ వేవ్‌ను 5 సూత్రాలతో కట్టడి చేయవచ్చని వివరించారు. ప్రజలకు విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వడంపై దృష్టి సారించాలని ప్రధానంగా పిలుపునిచ్చారు. అయితే దురదృష్టవశాత్తు మన్మోహన్ ఇవాళ కరోనా బాధితుల జాబితాలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement