Monday, April 29, 2024

వచ్చే వారం నుంచి ఇండియాకు ఎమిరేట్స్ విమాన సర్వీసులు..

దేశంలో కరోనా విజృంభణ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు మళ్లీ మొదలుకానున్నాయి. మన దేశంలో వైరస్ ప్రభావం అంతకంతకూ తగ్గుతున్న నేపథ్యంలో యునైటెడ్ ఎమిరేట్స్‌కు చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ వచ్చే వారం నుంచి సేవలను పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. భారత ప్రయాణికులు వారి రెసిడెన్స్ వీసాతోపాటు యూఏఈ ధ్రువీకరించిన రెండు కరోనా టీకా డోసులను తీసుకున్న వారికి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణించేందుకు అనుమతి లభిస్తుందని పేర్కొంది. ప్రయాణానికి ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షకు సంబంధించి నెగటివ్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి అని స్పష్టం చేసింది. కరోనా ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ 25న దుబాయ్-భారత్ మధ్య  విమాన సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, నైజీరియా, భారతదేశ ప్రయాణికుల కోసం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తాజాగా ఎమిరేట్స్ సంస్థ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement