Thursday, April 25, 2024

ఎన్టీఆర్ కూడా సెట్ లోకి వచ్చేస్తున్నాడట !!

బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి పాత్రలకు సంబంధించి విడుదలైన టీజర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.

ఇదిలా ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సెట్ లో అడుగుపెట్టారు. కాగా తాజా సమాచారం ప్రకారం కూడా ఈ వారం లోనే ఎన్టీఆర్ కూడా అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య అదిరిపోయే సాంగ్ ను షూట్ చేయబోతున్నారట. ఇక పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్ లు కూడా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement