Monday, April 29, 2024

Heavy Rains: భారీ వర్షాల ఎఫెక్ట్.. మళ్లీ మునిగిన బెంగళూరు సిటీ

బెంగళూరు సిటీని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో సిటీలోని రోడ్లన్నీ చెరువులను తలపించేలా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీరుచేరడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. ఐటీ క్యాపిటల్‌లో నిన్న (బుధవారం) సాయంత్రం మొదలైన వాన కుండపోతగా కురుస్తూనే ఉంది. దీంతో ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాజమహల్‌ గుట్టహళ్లి ప్రాంతంలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కాగా, మరో మూడురోజులపాటు మహానగరంలో భారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లో అలర్ట్​ని ప్రకటించింది.

గత నెల మొదటివారంలో కూడా బెంగళూరులోఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో సిలికాన్‌ సిటీ జలమయంగా మారింది. భారీవర్షానికి నగరంలోని అన్నిప్రాంతాల్లో వరద పోటెత్తింది. రోడ్లన్నీ స్విమ్మింగ్‌పూల్స్‌ను తలపించాయి. వరదల ధాటికి రెండురోజులపాటు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కొలువైఉన్న వైట్‌ ఫీల్డ్‌, మహదేవపుర, బొమ్మనహళ్లి ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ట్రాక్టర్లలో ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement