Tuesday, May 14, 2024

డైనమిక్ లీడర్ వెలిచాల జగపతిరావు ఇక లేరు.. అనారోగ్యంతో అర్ధరాత్రి కన్నుమూత

డైనమిక్ లీడర్​గా వెలుగొందిన కరీంనగర్ మాజీ ఎంఎల్ఏ వెలిచాల జగపతిరావు (87) బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ లో కన్నుమూశారు. జగపతిరావు రాజకీయ నాయకుడే కాకుండా కవి కూడా. పలు దినపత్రికల్లో వ్యాసాలు రాసారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్య పొందారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో తన రెండో కుమారుడు రాజేందర్ రావు వద్దకు వెళ్లారు అనారోగ్యంతో బాధపడుతూనూ ఆయన తుది శ్వాస విడిచినట్టు సమాచారం.

1972లో జగిత్యాల నుండి, 1989లో కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా జగపతిరావు గెలుపొందారు. పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా కూడా పనిచేసారు. తన భార్య సరళాదేవి మరణాంతరం ఎక్కువసమయం కరీంనగర్ లోనే ఉన్నారు. 2017లో తన భార్యపేరు మీద హరితహారం కార్యక్రమానికి 25లక్షల విరాళం ఇచ్చారు. జగపతి రావు ప్రకృతి ప్రేమికుడు కూడా. కరీంనగర్ లో తన నివాసంలో వేలాది మొక్కలను పెంచి బొటానికల్ గార్డెన్​గా తీర్చిదిద్దారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement