Sunday, May 19, 2024

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు ఈస్ట‌ర్ శుభాకాంక్ష‌లు – మంత్రి హ‌రీశ్ రావు

నేడు ఈస్ట‌ర్ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ రావు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు , క్రైస్త‌వ సోద‌రుల‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు. ఏసు ప్రభువు పునరుత్థానానికి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారని చెప్పారు. చెడుపై మంచి గెలిచిన రోజని, ప్రేమ, దయ, కరుణాగుణాన్ని సిలువపై తన జీవితం ద్వారా యేసు క్రీస్తు ప్రపంచానికి చాటిచెప్పిన రోజన్నారు. ఒకరిపట్ల ఒకరు ప్రేమతో, దయాగుణంతో వ్యవహరించాలని ఈస్టర్ సందర్భంగా కోరుకున్నారు. అంద‌రూ స‌ఖ్య‌త‌గా క‌లిసి మెలిసి ఉండాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement