Friday, April 26, 2024

అత్యంత ఎత్తులో ‘అల్లు అర్హ’ బ‌ర్త్ డే వేడుక‌లు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప చిత్రంలో న‌టిస్తున్నాడు. కాగా ఆయ‌న ముద్దుల త‌న‌య అల్లు అర్హ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను దుబాయ్ లోని బుర్జ్ ఖ‌లీఫాలో జ‌రిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ భవనంలోని ఓ ఫ్లోర్‌లో ఈ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. పూర్తి వ్యక్తిగతమైన ప్రైవేట్‌ ఫ్లోర్‌ ఇదని, ఇప్పటివరకు ఎవరూ ఇందులో జన్మదిన వేడుకలు జరుపుకోలేదని స‌మాచారం. అత్యంత ఎత్తులో జరుపుకున్న తొలి పుట్టినరోజు వేడుక ఇదేనని చెబుతున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో అల్లు అర్జున్‌, ఆయన భార్య స్నేహారెడ్డి పాల్గొన్నారు.ఇప్పుడా ఫొటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement