Monday, December 9, 2024

బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటి వద్ద షాకింగ్ ఘటన.. డ్రైవర్ సహా ముగ్గురు కిడ్నాప్

మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో కిడ్నాప్ కలకలం రేపుతోంది. న్యూఢిల్లీలోని సౌత్ ఎవెన్యూ ప్లాట్ నెంబర్ 105లోని జితేందర్ రెడ్డి నివాసం వద్ద కారు డ్రైవర్‎తోపాటు ముగ్గురు వ్యక్తులను దుండగులు  అపహరించారు. మహబూబ్ నగర్ కు చెందిన ఉద్యమకారుడు మున్నూరు రవి, తన ఇద్దరు స్నేహితులతో కలిసి వ్యక్తిగత పనుల మీద కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వచ్చారు. వీరంతా జితేందర్ రెడ్డి ఇంట్లో ఉంటున్నారు. అయితే, నిన్న సాయంత్రం రవితో పాటు అతని స్నేహితులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వీరందరినీ కారులో ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ పుటేజీలో నమోదయ్యాయి. వీరిని దుండగులు ఎందుకు అపహరించారనే విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఇప్పటివరకు కిడ్నాప్ అయిన వారి ఆచూకీ కూడా ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై జితేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‎కు సంబంధించిన విషయాన్ని జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement