Saturday, April 27, 2024

రాహుల్ కు నిరాశ.. రెండేళ్ల జైలుశిక్షపై స్టే కు నిరాకరణ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి నిరాశ ఎదురైంది. సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. జైలు శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. మోడీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ శిక్ష ఆధారంగా లోక్ సభలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది.

అయితే 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా దొంగల అందరి ఇంటి పేరు మోడీనే అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోడీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను మార్చి 23న సూరత్‌ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సూరత్‌ సెషన్స్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 13న వాదనలు పూర్తి కాగా.. ఇవాళ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది కోర్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement