Friday, May 3, 2024

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల..

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఈ రోజు (గురువారం) ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. జూలై నెలలో కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవతో సహా శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల ఆన్‌లైన్ కోటా ఏప్రిల్ 20 ఉదయం 11.30 నుండి బుకింగ్‌కు అందుబాటులో ఉంచారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు మధ్యాహ్నం 3 గంటలకు పొందవచ్చు. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈనెల 22వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement