Thursday, March 30, 2023

Breaking | పోలీస్ శాఖలో ఆక్సిలరీ ప్రమోషన్స్​.. ఉత్త‌ర్వులు జారీ చేసిన డీజీపీ

పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన పలువురికి పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర డీజీపి మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటాపురం ఎస్సైగా పనిచేస్తున్న జి. తిరుపతికి ఇన్స్పెక్టర్‌గా, చర్ల పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న అలెం రాజుకు ఇన్స్పెక్టర్ గా, రాజన్న జిల్లాలో డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ అహ్మద్ అలీషా కు ఎస్సైగా ప్ర‌మోష‌న్ ఇచ్చారు..

- Advertisement -
   

ఇక‌.. భద్రాద్రి జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మెరుగు రాజుకు ఎస్సైగా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మహేందర్ రావుకు ఏ ఆర్ ఎస్ ఐగా, ములుగులో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్. రమేష్ కు హెడ్ కానిస్టేబుల్ గా, ఏ ఆర్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఫరీదోద్దీన్, రాజ్ కుమార్ లకు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement