Saturday, April 27, 2024

Spl Story: కేదార్​నాథ్​ సన్నిధిలో పెంపుడు కుక్క.. కేదార్​ బాబా స్వరూపంగా భావిస్తున్న భక్తులు

కేదార్ బాబా కొలువై ఉన్న కేదార్​నాథ్​ ఆలయాన్ని పాండవులు నిర్మించారని ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పాండవులు స్వర్గానికి వెళ్లినప్పుడు వారితో ఒక కుక్క కూడా ఉందని చెబుతారు. యుధిష్ఠిరుడు భక్తితో ఉండిన ఓ కుక్కను ఎంతగానో ఇష్టపడ్డాడు. తనతో పాటు స్వర్గానికి తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉంటాడు. అనేది ఆ కథలో ఉంది. అయితే ఇప్పుడు పాండవులు నిర్మించిన కేదార్‌నాథ్ ఆలయంలోకి పెంపుడు కుక్క రావడంపై పెను దుమారం రేగుతోంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో కేదార్‌నాథ్ ఆలయంలో ఉన్న నంది పాదాలను తాకడానికి కుక్క యజమాని యత్నిస్తున్నాడని ఉన్న వీడియో పలువురిని బాధించింది. అంతే కాదు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బద్రీ-కేదార్ ఆలయ కమిటీ కూడా డిమాండ్ చేసింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్‌ ఆదేశాల మేరకు కమిటీ సీఈవో కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

అసలు విషయం ఏంటంటే..

నవాబ్ త్యాగి అనే కుక్కను రూ.లక్షకు కొనుగోలు చేశారు. ఈ కుక్క నోయిడాలో నివసించే హిమ్షి త్యాగికి చెందినది. వైరల్ వీడియోలో కుక్కతో పాటు ఆమె భర్త రోహన్ త్యాగి ఉన్నాడు. కేదార్‌నాథ్‌లో ప్రస్తుతం వైరల్‌గా ఉన్న వీడియోలోని కుక్క హస్కీ జాతికి చెందినదని హిమ్షి త్యాగి చెప్పారు. ఇది రష్యన్ జాతి కుక్క. మేము దాన్ని మా సొంత కొడుకులా పెంచుతామని, దాని పేరు ‘నవాబ్ త్యాగి’ అని హిమ్షి చెప్పింది. ప్రస్తుతం నవాబు వయస్సు 4 సంవత్సరాల 4 నెలలు. 2018లో బెంగళూరు నుంచి ఈ కుక్కను కొనుగోలు చేసి నోయిడాకు తీసుకురావడానికి చాలా ఖర్చు అయ్యింది. ఆ సమయంలో కుక్క వయస్సు కేవలం 50 రోజులు మాత్రమే. కాగా, నవాబ్ త్యాగి ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్. పారాగ్లైడింగ్ చేసిన తొలి కుక్కగా దీనికి మాంచి పేరుంది. నవాబ్, కేదార్నాథ్ ఆలయ వీడియోకు ముందు కూడా చర్చలో ఉంది. టిక్‌టాక్‌లో తనకు వెరిఫైడ్ పేజీ ఉందని హిమ్షి చెప్పింది. అదే సమయంలో దానికి Instagram (huskyindia0) లో 76 వేలకు పైగా ఫాలోవర్స్​ ఉన్నారని తెలిపింది.  భారతదేశంలో పారాగ్లైడింగ్‌కు వెళ్లిన మొదటి కుక్కగా ఇది రికార్డుల్లో ఉందని చెప్పుకొచ్చింది హిమ్షి.

ఈ కుక్కతో తాము పలు ప్రాంతాలను సందర్షించాం ప్రజలు దాన్నిశని దేవ్, భైరవ్ బాబా స్వరూపం అని పిలుస్తున్నారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌తో ఇబ్బంది పడుతున్నాం. ఇదంతా సోషల్ మీడియాలో మాత్రమే జరుగుతోందని హిమ్షి అంటోంది. కాకపోతే కేదార్‌నాథ్‌లోని ప్రజలంతా నవాబ్‌కు ఘనస్వాగతం పలికారని, నవాబ్ గతంలో కూడా తమతో పాటు చాలా దేవాలయాలకు వచ్చినట్టు చెబుతోంది. కానీ, కేదార్‌నాథ్​లో జనసందోహం, అధిక భద్రతతో కూడిన పెద్ద దేవాలయం కాబట్టి.. ఎవరైనా ఇబ్బంది పెడతారని భయపడ్డానని హిమ్షీ అంటోంది.  సుదీర్ఘ పాదయాత్ర (దాదాపు 16 కిలోమీటర్లు) తర్వాత కేదార్‌నాథ్‌కు చేరుకున్న తమకు కేదార్‌నాథ్ కాంప్లెక్స్ లోకి ప్రవేశం నిరాకరిస్తే ఏమి జరుగుతుందోనని భయపడ్డాం. కానీ, అలాంటిదేమీ జరగలేదు. కేదార్‌నాథ్‌లో ప్రతి ఒక్కరూ నా కుక్కను చాలా ప్రేమగా చూసుకున్నారు. దానికి ఎవరూ భయపడలేదు. దానితో ఫొటోలు తీసుకున్నారు.. భక్తులు, పూజారులు కూడా బాగానే ప్రవర్తించారు అని హిమ్షి చెప్పుకొచ్చింది.

కొంతమంది నవాబ్ పాదాలను కూడా తాకి.. దీన్ని భైరవ్ బాబా స్వరూపంగా భావిస్తున్నామని చెప్పారు. కొంతమంది పెద్దలు కూడా నవాబును అదృష్టవంతుడు అని అన్నారు. ఆ రోజు మొత్తం మూడు కుక్కలు కేదార్‌నాథ్‌కు వచ్చినట్టు హిమ్షి తెలిపారు. ఇందులో రెండు హస్కీ, లాబ్రా జాతి కుక్కలున్నాయి. లాబ్రా నలుపు రంగులో ఉంది. అక్కడ కూర్చున్న ఎవరో సాధువు ఇది శని దేవుడి రూపం అని చెప్పడం చూసి సంతోషించాం అని హిమ్షి తెలిపింది.

- Advertisement -

 బెదిరింపులు వస్తున్నాయి ..

అయితే.. ఈ నవాబ్​ కేదార్​నాథ్​కు వచ్చిన వీడియోలు వైరల్ అయిన తర్వాత తనకు సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని హిమ్షి త్యాగి తెలిపారు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోకి అడుగుపెట్టనివ్వడం లేదని కొందరు ట్రోలర్లు చెబుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను అడ్డుకోవడానికి వాళ్లెవరు? తాను , తన భర్త సమాజంలోని ఇతర కుక్కలను కూడా బాగా చూసుకుంటామని హిమ్షి చెప్పారు. ఇటీవల వారు పార్గో వ్యాధి నుండి ఆరు కుక్కలను రక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement