Wednesday, May 15, 2024

Cyrus Mistry accident: మిస్త్రీ మరణంపై దర్యాప్తు.. బెంజ్​ కారు డేటా ఎనలైజ్​​ చేస్తున్న నిపుణులు

పారిశ్రామికవేత్త సైరస్​ మిస్త్రీ మరణంపై విచారణ జరుగుతోంది. దీన్ని కొంతమంది సాధారణ యాక్సిడెంట్​గా భావిస్తుంటే.. ఇంకొంతమంది అనుమానాలు లేవనెత్తుతున్నారు. అంతపెద్ద పారిశ్రామిక వేత్త రోడ్డుమార్గంలో రావడానికి కారణాలేంటన్న ప్రశ్న కూడా చాలా మంది నుంచి ఎదురవుతోంది. ఎప్పుడూ విమాన ప్రయాణం చేసే మిస్త్రీ ఈసారి కారులో రావడానికి గల కారణాలపై కూడా అన్వేషణ కొనసాగుతోంది.

అయితే.. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన ఒక టీమ్​ ఇవ్వాల (మంగళవారం) కారు యాక్సిడెంట్​ జరిగిన ప్రదేశాన్ని సందర్శించింది. అంతేకాకుండా కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న విధానంపై అనలైజ్​ చేస్తున్నారు. ఇక.. కారు డేటాను సేకరించి మరింత విశ్లేషణ కోసం డీక్రిప్ట్ చేయనున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి కారు టైర్ ప్రెజర్, బ్రేక్ ఫ్లూయిడ్ లెవెల్ వంటి ఇతర వివరాలపై కూడా దర్యాప్తు జరుగుతుందని కొంకణ్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ (ఐజీ) పోలీస్ సంజయ్ మోహితే తెలిపారు.

Mercedes-Benz కంపెనీకి చెందిన అధికారులు సందర్శించి ప్రమాదానికి గురైన కారు నుండి ఎన్‌క్రిప్టెడ్ డేటాను సేకరించారు. డేటాని విశ్లేషన చేయనున్నారు. దాన్ని డీక్రిప్ట్ చేసి, తదుపరి విచారణ కోసం పోలీసులతో షేర్​ చేసుకోనున్నారు అని ఐజీ చెప్పారు. ఇక.. తక్కువ బ్రేక్ ఫ్లూయిడ్​ లెవల్​తో కూడా కారు సరిగా బ్రేక్స్​ పనిచేయకపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్పాంజీ బ్రేక్ పెడల్స్ ప్రమాదకరమని అధికారి తెలిపారు.

మహారాష్ట్రలోని పొరుగున ఉన్న పాల్ఘర్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం సైరస్​ మిస్త్రీ (54), అతని స్నేహితుడు జహంగీర్ పండోలె కారులో వస్తుండగా రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో మరణించారు. కారులో ఉన్న మరో ఇద్దరు అనాహిత పండోల్ (55), ఆమె భర్త డారియస్ పండోల్ (60) తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, నలుగురు వ్యక్తులు గుజరాత్ నుంచి ముంబైకి వస్తుండగా సూర్య నది వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక విచారణ ప్రకారం మృతులు సీటు బెల్టులు ధరించలేదని, అతివేగం, డ్రైవర్ చేసిన తీలోలో లోపమే ప్రమాదానికి కారణమని పోలీసులు గతంలో తెలిపారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement