Wednesday, May 1, 2024

రీ రిలీజ్ ట్రెండ్​లో మరో సినిమా.. ఈ నెల 8వ తేదీన‌ థియేటర్లలోకి రానున్న ‘త్రీ’..

ధనుష్ & శ్రుతి హాసన్ జంట‌గా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వ‌చ్చిన సినిమా ‘3’. ఈ మూవీ 2012 మార్చి 30 న విడుద‌లైంది. ఈ సినిమాలోని ఆల్బ‌మ్స్ ఇప్ప‌టికీ మ‌న ఎంతో ఫెమ‌స్. ‘కొలవెరి డి’ అని ధ‌నుష్ పాడిన పాట మేకింగ్ వీడియోను మేక‌ర్స్ విడుదల చేసగా అది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫెమ‌స్ అయ్యింది. ఈ పాట గ్లోబల్ చార్ట్‌బస్టర్‌లో అగ్రస్థానంలో నిలిచిన మొదటి భారతీయ పాటగా రికార్డ్ సాదించింది. ఈమూవీ క్రియేట్ చేసిని హైప్ కు త‌గ్గ‌ట్టు తియేట‌ర్ల‌లో ఆడ‌లేదు.. స‌మీక్ష‌కుల‌నుంచి అంత‌మంచి రివ్యూస్ అందుకులేక‌పోయింది.

అయినప్పటికీ, సంవత్సరాలుగా కల్ట్ క్లాసిక్ హోదాను పొందింది ఈ సినిమా. అనిరుధ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్‌తో పాటు ధనుష్ పెర్‌ఫార్మెన్స్‌కి ఇప్పటికీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. కాగా, సినిమా రిలీజ్ అయిన దశాబ్ద కాలం తర్వాత రీ- రిలీజ్ కి సిద్దం అవుతుంది ఈ సిన‌మా. ఈ నెల 8వ తేదీన థియేట‌ర్ల‌లో మ‌ళ్లీ రిలీజ్ కాబోతున్న‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న‌లు కూడా వ‌చ్చాయి. అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని చూడటానికి ఇప్పటికే ఉత్సుకతతో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement