Wednesday, May 8, 2024

ఏపీలో మరోసారి కర్ఫ్యూ వేళల్లో మార్పులు

ఏపీలో కరోనా పరిస్థితులపై అధికారులతో సోమవారం నాడు ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఏపీలో కర్ఫ్యూ సమయం సడలింపుపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇవ్వాలని ఆదేశించారు. రాత్రి 9 గంటలకు రాష్ట్రంలోని అన్ని షాపులను మూసివేయాలన్నారు. కరోనా నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేయాలని, మాస్కు లేకపోతే రూ.100 జరిమానా వేయాలన్నారు.

దుకాణాలలో సిబ్బంది, కొనుగోలుదారులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులకు భారీ జరిమానాలు విధించాలన్నారు. నిబంధనలు పాటించని షాపులను 2-3 రోజులు మూసేయాలన్న జగన్.. నిబంధనల ఉల్లంఘనపై ఎవరు ఫోటో తీసి పంపినా ఫైన్లు విధించాలన్నారు. ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు చేయాలని.. ప్రజలెవరూ గుమిగూడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.

కరోనాపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ వార్త కూడా చదవండి: విజయవాడలో కదం తొక్కిన నిరుద్యోగులు

Advertisement

తాజా వార్తలు

Advertisement