Tuesday, May 14, 2024

ఆకాశం నీ హద్దురా హిందీ రీమేక్…డైరెక్టర్ ఎవరో తెలుసా ?

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సుధా కొంగర దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆకాశం నీ హద్దురా. ఓటీటీ వేదికగా రిలీజైన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నారు. సూర్య జ్యోతిక రాజశేఖర్ పాండ్యన్ కలసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఈ రీమేక్ చిత్రానికి కూడా సుధా కొంగరానే దర్శకత్వం వహించబోతున్నారు. కాగా ఇందులో హీరోగా ఎవరు నటిస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సూర్యనే నటిస్తారా వేరే ఎవరైనా నటిస్తారా అనేది చూడాలి. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నామని ప్రకటించడానికి ఎగ్జైటింగ్ గా ఉందన్నారు దర్శకురాలు సుధా కొంగర.

Advertisement

తాజా వార్తలు

Advertisement