Tuesday, May 14, 2024

కొత్త రికార్డ్ సృష్టించిన.. కోహ్లీ

భార‌త్..బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ కొత్త రికార్డుని సృష్టించాడు.అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లీ పేరుతో 291 క్యాచ్ లు నమోదు అయ్యాయి. 482 మ్యాచుల్లో 572 ఇన్నింగ్స్ లలో ఈ క్యాచ్ లను అందుకున్నాడు. జయవర్ధనే 440 క్యాచ్ లతో తొలి స్థానంలో ఉన్నాడు. టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఏకంగా 188 పరుగుల తేడాతో టీమిండియా విజయ డంకాను మోగించింది. రెండో ఇన్నింగ్స్ లో 513 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ను ఆరంభించిన బంగ్లాదేశ్ జట్టు 324 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అయితే ఐదో రోజు మొదటి సెషన్ లోనే టీమిండియా విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement