Thursday, May 2, 2024

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స ఫీజులు ఖరారు

ఏపీలో ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స ఫీజు నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సాధారణ కోవిడ్ చికిత్సకు ఎన్​ఏబీహెచ్​ ఆస్పత్రుల్లో రోజుకు రూ.4 వేలుగా… ఎన్​ఏబీహెచ్​ ఆమోదం లేని ఆస్పత్రుల్లో రోజుకు రూ. 3,600గా ఫీజును ఖరారు చేసింది. సాధారణ కోవిడ్ చికిత్స, ఆక్సిజన్ కలిపి ఎన్‌ఏబీహెచ్ ఆస్పత్రుల్లో రూ.6,500 ఫీజును.. ఎన్‌ఏబీహెచ్ ఆమోదం లేని ఆస్పత్రుల్లో రూ.5,850గా ఫీజు నిర్ణయించింది. క్రిటికల్, ఐసీయూ, ఎన్‌ఐవీ ట్రీట్మెంట్ కు ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రుల్లో రూ.12 వేలు, ఎన్‌ఏబీహెచ్‌ ఆమోదం లేని ఆస్పత్రుల్లో రూ.10,800గా నిర్ణయించారు. ఐసీయూ (వెంటిలేటర్) చికిత్సకు ఎన్‌ఏబీహెచ్ ఆస్పత్రుల్లో రూ.16 వేలు, ఎన్‌ఏబీహెచ్ ఆమోదం లేని ఆస్పత్రుల్లో రూ.14,400గా ఫీజును నిర్ణ‌యించింది. ఈ మేరకు ఫీజులను వెల్లడిస్తూ మంగళవారం నాడు ఏపీ స‌ర్కార్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement