Sunday, May 19, 2024

ఉదయం 8:45 వరకే మెట్రో సేవలు

తెలంగాణ‌లో నేటి నుంచి ప‌ది రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల మ‌ధ్య‌లో మాత్ర‌మే మెట్రో స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉదయం 7 నుంచి ఉదయం 8:45 వరకే మెట్రో సేవలు ఉండనున్నాయి. ఉదయం 8:45 కే చివరి మెట్రో నడవనుంది.  ఫ‌స్ట్ ట్రైన్ టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరనుంది. లాస్ట్ ట్రైన్ ఉదయం 8:45 నిమిషాలకు మొదలు కానుంది. ఈ రైలు ఉదయం 9:45 గంటల కల్లా సంబంధిత చివరి స్టేషన్‌కు చేరుకుంటుంది.

రాష్ట్రంలో  వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేప‌థ్యంలో ప్రతి ఒక్కరి భద్రత కోసం, ప్రయాణికులు భౌతిక దూరం పాటించ‌డం, ఫేస్ మాస్క్‌లు ధరించడం, క్రమంగా హ్యాండ్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ వంటి క‌రోనా భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని మెట్రో రైలు సంస్థ కోరింది. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సేఫ్ గా ఉంచే ప్రయత్నాలలో భద్రతా సిబ్బంది, హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బందితో సహకరించాలని సూచించారు.

కాగా, నైట్ క‌ర్ఫ్యూ అమలు చేస్తున్న‌ప్ప‌టికి కూడా తెలంగాణ‌లో కరోనా మ‌హ‌మ్మారి అదుపులోకి రాలేదు. దీంతో రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కేవ‌లం ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల‌ వ‌ర‌కు మాత్ర‌మే దుకాణాలు, నిత్యావసర సరుకుల కొనుగోలుకు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.

ఇదీ చదవండి: ఒక్కోసారి ఎంత కష్టపడినా నష్టాలు జరుగుతున్నాయి: రుయా ఘటనపై సీఎం జగన్

Advertisement

తాజా వార్తలు

Advertisement