Wednesday, May 8, 2024

పిల్లలకు కొవాగ్జిన్ టీకా.. అత్యవసర వినియోగానికి అనుమతి?

కరోనా కట్టడిలో మరో ముందడుగు పడింది. ఇప్ప‌టి వ‌ర‌కు 18 ఏళ్లు నిండిన వారికి మాత్ర‌మే దేశంలో టీకాలు ఇస్తున్నారు. తర్వలో పిల్లలకు కూడా టీకాలు పంపిణీ చేయనున్నారు. 2 నుంచి 18 సంవత్సరాల పిల్లల కోసం భారత్​ బయోటెక్​ సంస్థ నిర్వ‌హించింది.  కోవాగ్జిన్ టీకాల ట్ర‌య‌ల్స్ పూర్తికావ‌డంతో డేటాను ఇప్ప‌టికే కేంద్రం ఆరోగ్య శాఖ‌కు అంద‌జేసింది.  చిన్నారుల టీకా వినియోగానికి సంబంధించి అనుమతి కోసం సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది.  డ్ర‌గ్స్ రెగ్యులేట‌రీ అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే టీకాను పిల్ల‌ల‌కు అందించనున్నారు. 2 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్ల‌ల‌కు టీకాను అందించేందుకు కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: దేశ వ్యాప్తంగా బొగ్గు సంక్షోభం.. 115 కేంద్రాల్లో అడుగంటిన నిల్వలు

Advertisement

తాజా వార్తలు

Advertisement