Monday, May 20, 2024

కేజ్రీవాల్ ఇంటిపై దాడి చేసిన దుండ‌గుల‌కు – బెయిల్ నిరాక‌ర‌ణ‌

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం వెలుపల జరిగిన విధ్వంసానికి సంబంధించి అరెస్టయిన నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించింది. అరవింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల హింసాత్మక నిరసనలు మరియు విధ్వంసానికి సంబంధించి అరెస్టయిన ఎనిమిది మంది వ్యక్తుల బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, శాంతియుతంగా నిరసనలు చేయడం ప్రాథమిక హక్కు కంటే ఎక్కువ అని కోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యతో చంద్రకాంత్ భరద్వాజ్, నవీన్ కుమార్, నీరజ్ దీక్షిత్, సన్నీ, జితేంద్ర సింగ్ బిష్త్, ప్రదీప్ కుమార్ తివారీ, రాజు కుమార్ సింగ్, బబ్లూ కుమార్‌లకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఈ విచారణ సందర్భంగా, ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను నిరసనకారులు ఏమాత్రం గౌరవించలేదని అదనపు సెషన్స్ జడ్జి నవీన్ కశ్యప్ అన్నారు. సీఎం నివాసం వెలుపల నిరసనలకు అనుమతి లేదని ఢిల్లీ హైకోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా చెప్పిందని కోర్టు పేర్కొంది. న్యాయమూర్తి నవీన్ కశ్యప్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులకైనా సమావేశమై నిరసన తెలిపే ప్రాథమిక హక్కు ఉందనడంలో సందేహం లేదు, అయితే ఈ హక్కు సాధనకు కొన్ని పరిమితులు ఉన్నాయ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement