Wednesday, May 22, 2024

వైఫైలా మ‌న చుట్టూ క‌రోనా….

సీసీఎంబీ అధ్యయనం ఫలితాల సారాంశం
అసింప్టమాటిక్‌ పేషెంట్ల నుంచే వేగంగా వ్యాప్తి
యువతలోనే అధికం ఈ నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరి
లేనిపక్షంలో మరోసారి వైరస్‌ వ్యాప్తి

హైదరాబాద్‌, : ” కరోనా పాజిటివ్‌ కేసు లు తగ్గుతున్నాయి. వైరస్‌తో చనిపోతున్న వారి సంఖ్య కూడా తగ్గింది. పైపెచ్చు కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేసింది. ఇక మనకు ఏమి కాదులే.” అని అనుకుంటే వైరస్‌కు అడ్డం గా దొరికిపోయినట్టేనని వైద్య నిపుణులు హె చ్చరిస్తు న్నారు. ఎందుకంటే వైఫై సిగ్నల్స్‌ మాదిరిగా కరోనా వైరస్‌ మన చుట్టూనే ఉందంటున్నారు. తాజాగా సీసీఎంబీ, ఎన్‌ఐఎన్‌, ది. భారత్‌బయోటెక్‌ విడుదల చేసిన అధ్యయ నం ఇదే విషయాన్ని నిరూపిస్తోందని చెబుతున్నారు.
అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లో 54శాతం మందిలో కరోనా యాంటీబాడీస్‌ వృద్ధిచెందడాన్ని పరిశీలిస్తే… నగరంలోని ప్రతీ ఇద్దరిలో ఒకరికి ఇప్పటికే వైరస్‌ సోకిందని స్పష్టమవుతోంది. అయితే కరోనా సోకిందన్న విషయం వారికి తెలియదని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేష్‌ మిశ్రా బాంబు పేల్చారు. హైదరాబాద్‌ నగరంలోని 75శాతం మందికి కరోనా వచ్చిపోయిందని చెప్పారు.
అసింప్టమాటిక్‌ కేసులతోనే అసలు తంటా…
యువతలోనే అసింప్టమాటిక్‌ కేసులు
సీసీఎంబీ సంయుక్త అధ్యయన ఫలితాల నేప థ్యంలో అసింప్టమాటిక్‌ (లక్షణాలు బహిర్గతం కాని కరోనా పాజిటివ్‌ వ్యక్తులు) కేసుల అంశం మరోసారి తెరపై కి వచ్చింది.ప్రస్తుతం తెలంగాణలో 2, 99, 572 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… వారిలో 70శాతం అంటే 2, 09, 700 మంది అసింప్టమాటిక్‌ పేషెంట్లే. కేవలం 89, 872 మందిలో మాత్రమే కరోనా లక్షణాలు బహిర్గతం అయ్యాయి. ఈ గణంకాలను పరిశీలిస్తే కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోందని, మనకు తెలియ కుండానే ఒకరి నుంచి మరొకరకి వేగంగా వ్యాపిస్తున్నట్లు అర్థమవుతోంది. కరోనా తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యంగా మాస్కు ధరించకపోవడం, భౌతికదూరం పాటిం చకపోవడం చేస్తే… మరోసారి కరోనా వైరస్‌ విజృం భించే ప్రమా దముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవ నోపాధి కోసం వివిధ వృత్తులు చేసే యువత లోనే కరోనా అసింప్టమాటిక్‌ పేషెంట్లు అధికంగా ఉన్నా రని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ లెక్కలు చెబు తున్నాయి. మొత్తం కరోనా పేషెంట్లలో 21-30 ఏళ్ల వారు 23.66శాతం, 31-40 ఏళ్ల మధ్య 23.04శాతం ఉన్నారు.
యువత నుంచి వేగంగా వ్యాప్తి
యువత నుంచి వైరస్‌ ఇంట్లోని, పని ప్రదేశంలోని దీర్ఘ కాలిక వ్యాధి గ్రస్థులకు, వృద్ధులకు పాకినపుడు వారి లో ప్రాణాంతకమవుతోందని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్న తాధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో… ప్రజలం తా ముఖ్యంగా కరోనా జాగ్రత్తలు పాటించాలని, అల సత్వం వహిస్తే కరోనా మళ్లిd విజృంభించే ప్రమా దముందని సీసీఎంబీ అధ్యయనం హెచ్చరించింది.

బాధ్యతతో మెలగాల్సిన సమయమిది
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై తాజా అధ్యయనాల నేపథ్యం లో అసింప్టమాటిక్‌ పాజిటివ్‌ కేసుల ద్వారానే వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందని స్పష్టమవుతోంది. 90శాతం అసింప్టమాటిక్‌ కేసులు 21-40 ఏళ్ల వయస్సు ఉన్న వారి నుంచే. ఈ పరిస్థితుల్లో యువత బాధ్యతలో మెలగాల్సి ఉంది. పని ప్రదేశంలో, ప్రయాణ సమయంలో తప్పనిసరిగా మాస్కును ధరించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. పబ్‌లు, క్లబ్‌లు, పార్టీలకు యువత దూరంగా ఉండాల్సిందే. పనిప్రదేశంలోనూ, పార్టీలో నుంచో యువత వైరస్‌ను ఇంట్లోకి మోసుకెళ్తున్నారు. ఫలితంగా ఇంట్లోని వృద్ధులు, చిన్నారులకు కరోనా సోకి… ప్రాణాంతకంగా మారుతోంది. ….డాక్టర్‌. జీ శ్రీనివాసరావు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌

391 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌
రాష్ట్రవ్యాప్తంగా 391 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. 60 ఏళ్ల వృద్ధులు, 45 ఏళ్ల పైబడిన దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు టీకా వేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 251 కేంద్రాల్లో 11,377 మందికి 96 శాతం మేర, 140 ప్రైవేట్‌ కేంద్రాల్లో 10,449 మందికి 88 శాతం మేర టీకాలు వేశారు. వైద్య సిబ్బందిలో 1208 మందికి మొదటి డోస్‌, 6,480 మందికి రెండో డోస్‌ ఇచ్చారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌లో 405 మందికి మొదటి డోస్‌, 11 మందికి రెండో డోస్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,35,472 మందికి వివిధ డోసుల్లో కరోనా టీకా ఇచ్చారు.నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వృద్ధులు, 45 ఏళ్లుపైడిన వారికి టీకా కార్యక్రమం కొనసాగుతుందని రాష్ట్ర వ్యాక్సినేషన్‌ ఇంఛార్జి డాక్టర్‌ జి.శ్రీనివాసరావు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement