Wednesday, May 8, 2024

Goa elections: గోవా ఎన్నికల ప్రచారంలో రాహుల్.. సీఎం నియోజవకర్గంలో ర్యాలీ

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన రాహుల్ గోవాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ నియోజకవర్గం సాంక్వెలిమ్‌లో వర్చువల్ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా రాహుల్ ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికలు జరుగనున్న గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ కొనసాగుతున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement