Saturday, May 11, 2024

మేడారం జాత‌ర‌కు 10వేల మంది పోలీస్ సిబ్బంది : డీజీపీ

మేడారం మహా జాతర కోసం 10 వేల మంది వివిధ హోదాల్లోని పోలీస్ సిబ్బంది సేవలు అందించడం జరుగుతుందని రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుంది. మేడారం మహాజాతరకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ జాతరకు రూ.75 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ జాత‌ర‌పై ఈరోజు డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా చర్యలు తీసుకుంటార‌న్నారు. అదే విధంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారన్నారు. గద్దెల దగ్గర పూజారులతో సత్సంబంధాలు ఉండేలా చూసుకోవాలన్నారు. జాతరకు వచ్చే ప్రతి వెహికల్ ను సక్సెస్ గా లోపలకి పంపితే ట్రాఫిక్ క్లియర్ అయినట్టే.. ఇబ్బంది ఉండదని, రోడ్డు మీద వాహనాలు నిలవకుండా చూసుకోవాలన్నారు. వీఐపీ, వీవీఐపీలు, ప్రోటోకాల్ లో ఉన్న వారి వాహనాలతో సామాన్యులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ.. క్లియర్ చేస్తూ జాతర విజయవంతం చేయాలని ఆదేశించారు. జాతర విధుల్లో ఉండే పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే, డ్యూటీ సక్సెస్ గా చేయడం జరుగుతుందని..అప్పుడు జాతర విజయవంతం అవుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement