Sunday, April 28, 2024

క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యం – ఇక‌పై సినిమాల్లో న‌టించ‌న‌ని ట్వీట్

2022లో నేను న‌టించేది ఆఖ‌రి చిత్రం అని ..ఇక‌పై సినిమాల్లో న‌టించ‌బోన‌ని తెలిపారు క‌మెడియ‌న్. న‌టుడు రాహుల్ రామ‌కృష్ణ‌. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. నేను పట్టించుకునేది కాదు, ఎవరూ పట్టించుకోకూడదన్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు రాహుల్ రామకృష్ణ . ఆ తర్వాత.. పెళ్లి చూపులు.. జాతిరత్నాలు వంటి సినిమాలతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. కమెడియన్‏గా.. నటుడిగా రాణిస్తూ మంచి ఫాంలో దూసుకుపోతున్న తరుణంలో రాహుల్ రామకృష్ణ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.

ఇక పై తాను సినిమాల్లో నటించనని తెలిపారు. 2022 వరకు మాత్రమే తాను సినిమాల్లో నటిస్తానని.. ఆ తర్వాత నటనకు దూరం అవుతానని రాహుల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. దీంతో రాహుల్ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆకస్మాత్తుగా రాహుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఇలా చేస్తున్నాడా అంటున్నారు ప‌లువురు నెటిజ‌న్స్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/eyrahul/status/1489648833252704257

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement