Thursday, April 25, 2024

Delhi fog : ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్, టేకాఫ్‌లకు కాస్త ఇబ్బందులు తలెత్తాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. పంజాబ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కనిపించింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లో శనివారం ఉదయం దృశ్యమానత 50 మీటర్లుగా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement