Tuesday, April 30, 2024

నేడు ముంబైకి సీఎం కేసీఆర్.. ఉద్ధవ్‌ ఠాక్రేతో జాతీయ రాజకీయలపై చర్చ

జాతీయ స్థాయిలో యూపీఏ, ఎన్డీయేలకు ధీటుగా బలమైన ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుకు నడుం బిగించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఆహ్వానం మేరకు ఆదివారం ముంబై వెళ్తున్నారు. కొత్త కూటమి, భవిష్యత్ రాజకీయ పరిణామాలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఉద్ధవ్ థాకరేతో విస్తృతంగా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అనంతరం ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్‌పవార్‌తోనూ చర్చలు జరుపనున్నారు.

ఉదయం 11గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం ఒంటి గంటకు ఉద్ధవ్‌తో భేటీ కానున్నారు. రాత్రికి తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఠాక్రేతో కలిసి భోజనం చేసిన అనంతరం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను సాయంత్రం నాలుగు గంటలకు కలుసుకోనున్నారు. కేసీఆర్‌ వెంట పలువురు పార్టీ నాయకులు కూడా వెళ్లనున్నా రు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోదీ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న కేసీఆర్.. బీజేపేతర ప్రక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని దెబ్బ కొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement