Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 46

46.
సంజయ ఉవాచ
ఏవముక్త్వార్జున: సంఖ్యే
రథోపస్థ ఉపావిశత్‌ |
విసృజ్య సశరం చాపం
శోకసంవిగ్నమానస:

తాత్పర్యము : సంజయుడు పలికెను : రణరంగమునందు అర్జునుడు ఆ విధంగా పలికి ధనుర్భాణములను పడవేసి దు:ఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు కూర్చుండిపోయెను.

భాష్యము : శత్రుసైన్యాన్ని పరిశీలించుటకు నిలబడిన అర్జునుడు దు:ఖము అతశయింపగా ధనస్సును, బాణములను విస్మరించి తిరగ కూర్చుండిపోయెను. అటువంటి కరుణ, కోమల హృదయుడైన వ్యక్తి భగవద్భక్తిలో ఆత్మ జ్ఞానమును పొందుటకు తగిన వ్యక్తి.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాదే
అర్జునవిషాదయోగోనామ ప్రథమో ధ్యాయ: ||

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement