Tuesday, May 14, 2024

Breaking: లారెన్స్ హీరోగా చంద్రముఖి-2.. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన లైకా సంస్థ‌

2005లో వ‌చ్చిన చంద్రముఖి సినిమా చాలా సెన్సేష‌న్ హిట్ అయ్యింది. ఆ సినిమాను ప్రేక్షకులు ఇంకా మ‌రిచిపోలేక‌పోతున్నారు. ఇప్ప‌టికీ అందులో డైలాగ్స్‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెబుతుంటారు. ఎందుకంటే సినిమా నమోదు చేసిన సంచలనం అలాంటిది. పి. వాసు టేకింగ్.. బలమైన కథాకథనాలు.. ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలు.. విద్యాసాగర్ సంగీతం ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ లో ప్రెజెంట్ చేశాయి.

అయితే.. రజనీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. అట్లాంటి సినిమాకి ఆయనతోనే సీక్వెల్ ప్లాన్ చేశారు మేక‌ర్స్‌, కానీ ప‌రిస్థితులు కుదరలేదు. దీనిపై రజనీ కాంత్ అంతగా ఆసక్తిని చూపడం లేదనే టాక్ వచ్చింది. అనుకున్నట్టుగానే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ను డ్యాన్స్ మాస్ట‌ర్‌ లారెన్స్ తో చేస్తున్నారు.

‘చంద్రముఖి 2’ టైటిల్ ను ఖరారు చేసి.. ఇవ్వాల (మంగ‌ళ‌వారం) కొద్దిసేప‌టి క్రిత‌మే అధికారిక పోస్టర్ ను వదిలింది లైకా సంస్థ‌. నిన్న‌టి నుంచి ఊరిస్తూ వ‌చ్చిన లైకా యాజ‌మాన్యం ఇవ్వాల‌ ‘చంద్రముఖిస‌కి సంబంధించిన‌ ఉత్కంఠను రేకెత్తించే మేడపై గదినే పోస్టర్ లో చూపించారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించ‌నున్నారు. లారెన్స్ – పి.వాసు కాంబినేషన్లో గతంలో ‘శివలింగ’ వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement