Saturday, May 21, 2022

ఎయిర్ ఇండియా సీఈవో, ఎండీగా క్యాంప్‌బెల్ విల్స‌న్‌

ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా క్యాంప్‌బెల్ విల్స‌న్‌ను నియ‌మిస్తూ టాటా స‌న్స్ పేర్కొన్న‌ది. ఎయిర్ ఇండియా సంస్థ‌ను గ‌త ఏడాది టాటా గ్రూపు టేకోవ‌ర్ చేసుకున్న విష‌యం తెలిసిందే. సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ గ్రూపులో గ‌తంలో విల్స‌న్ ప‌ని చేశారు. దాంట్లో ఆయ‌న‌కు 15 ఏళ్ల అనుభ‌వం ఉన్న‌ది. జ‌పాన్‌, కెన‌డా, హాంగ్‌కాంగ్ దేశాల్లో ఆయ‌న ప‌నిచేశారు. 1996లో ఎస్ఐఏలో మేనేజ్మెంట్ ట్రైనీగా త‌న కెరీర్‌ను ప్రారంభించారు. టాటా గ్రూపున‌కు చెందిన విస్తారాకు ఎస్ఐఏ భాగ‌స్వామిగా ఉంది. సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్‌కు అనుబంధ సంస్థ అయిన స్కూట్‌లో సీఈవోగా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement