Sunday, May 5, 2024

నేడు బంగారం, వెండి తాజా ధరలు ఇవే

బంగారం, వెండి కొనుగోలుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బంగారం ధర (gold price) నిరంతరంగా హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఈరోజు బంగారం ధర కాస్త పెరిగింది. మరోవైపు నిన్న బంగారం ధర 0.18 శాతం తగ్గింది. ఈ పతనం తర్వాత బంగారం ధరలు 48,000కి తగ్గాయి.
డిసెంబర్ 31 సంవత్సరంలో చివరి రోజు మాత్రమే కాదు శుక్రవారం కావడంతో వారం ప్రకారం చివరి బిజినెస్ డే కూడా. ఈరోజు బంగారం (gold), వెండి (silver) ధరలు ఫ్లాట్ నోట్‌లో ట్రేడవుతున్నాయి. భారత ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. కాగా వెండి ధర కూడా రూ.100 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.


దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు…
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,020, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,120.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,760, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320.
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,750.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990.
హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990.


వెండి ధరలు ఇలా ఉన్నాయి.. మల్టీ కమోడిటీ ఇండెక్స్‌లో ఉదయం 9:40 గంటలకు వెండి ధర కిలోకు రూ.110 పెరిగి రూ.62270 వద్ద ట్రేడవుతోంది. కాగా, నేడు కిలో వెండి ధర రూ.62400 వద్ద ప్రారంభమైంది. ఇది కూడా నేటి అధిక స్థాయి. ఒక రోజు ముందు వెండి కిలో ధర రూ.62160 వద్ద ముగిసింది. 2021లో వెండి దాదాపు 9 శాతం క్షీణతతో ట్రేడవుతుంది. నిన్నటి కంటే కిలో గ్రాముకు రూ.800 తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.65,500 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,500గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,600గా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement