Sunday, May 12, 2024

Breaking : దిశా సాలియన్ కేసులో కొత్త ట్విస్ట్, బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతికి సంబంధించి కేంద్ర మంత్రి నారాయణ్ రాణే, ఆయన కుమారుడు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నితీష్ రాణేపై ఫిర్యాదు నమోదైంది. మహిళా కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత, మల్వాని పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు చేప‌ట్టారు. రీసెంట్ గా నారాయణ్ రాణే సాలియన్ మీడియాతో మాట్లాడుతూ.. సామూహిక అత్యాచారం. హత్యకి సంబంధించి తనపై ఆరోపణలను ఖండించారు. దిశా శవపరీక్ష నివేదిక ప్రకారం ఆమెపై అత్యాచారం జరగలేదని, గర్భవతి కూడా కాదని మహారాష్ట్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చకంకర్ వెల్ల‌డించార‌న్నారు. దిశా మరణం గురించి తప్పుడు సమాచారం అందించినందుకు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే, ఎమ్మెల్యే నితీష్ రాణే సంబంధిత అందరిపై దిశా సాలియన్ తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని చకంకర్ అన్నారు.పని ఒత్తిడి కారణంగా ఆమె ఒత్తిడికి లోనవుతుందని సలియన్ తల్లిదండ్రులు చెప్పారన్నారు. ఆ సమయంలో, ఆమె ఒత్తిడి మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింద‌న్నారు. ఆమె పోస్ట్‌మార్టం నివేదిక పోలీసుల వద్ద ఉంది, అందులో ఆమె ఆత్మహత్య చేసుకుందని తేలింది. తన కూతురు చనిపోయాక, తన కూతురిని రాజకీయ నేతలు దూషించవద్దని కోరుతూ దిశా తల్లి కమిషన్‌కు లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement