Monday, April 29, 2024

నిరుద్యోగ యువత కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడం ఖాయం

తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ భవన్ లో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు మద్దతుగా ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులు వెళ్లారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2 లక్షల 50 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు బిశ్వాల్ కమిటీ  చెప్పిందని అన్నారు. అయితే, దానిని పక్కన పెట్టి.. మళ్లీ కొత్త కమిటీ అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. దీని వల్ల 29 లక్షల మంది నిరుద్యోగులకు నోటిఫికేషన్లపై ఎదురుచూపులే మిగలుతున్నాయన్నారు. కమిటీ ఒకవేళ నివేదికను త్వరగా ఇచ్చినా.. కేసీఆర్ సర్కార్ మళ్లీ ఏదో సాకును ముందుకు తెచ్చినా ఆశ్చర్యపోనక్కర లేదన్నారు. ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వెలువడినా.. మళ్లీ కోర్టు చిక్కుల్లో ఇరుక్కునేలా నోటిఫికేషన్లను తయారు చేయడం ఈ ప్రభుత్వానికి షరా మామూలే అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని అని సీతక్క డిమాండ్ చేశారు.   

Advertisement

తాజా వార్తలు

Advertisement