Friday, April 26, 2024

Breaking : ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్ – కొవిడ్ సేఫ్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం ‘సీఈసీ’

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్రెస్ మీట్ పెట్టింది. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ ని సీఈసీ ప్ర‌క‌టించారు. ఐదు రాష్ట్రాల్లో 690అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. పంజాబ్,గోవా,మ‌ణిపూర్ ల‌లో మార్చితో అసెంబ్లీ గ‌డువు ముగియ‌నుంది. యూపీ,పంజాబ్,గోవా,మ‌ణిపూర్,ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల‌కు షెడ్యూల్ ని విడుద‌ల చేశారు. క‌రోనా నిబంధ‌న‌ల‌తో పోలింగ్ ని నిర్వ‌హించ‌నున్నారు. ఐదు రాష్ట్రాల ఆరోగ్య‌శాఖ‌ల‌తో సీఈసీ సంప్ర‌దింపులు జ‌రిపారు. క‌రోనా ప్ర‌భావంపై ఐదు రాష్ట్రాల్లో సీఈసీ బృందం ప‌ర్య‌టించింది. ఈ మేర‌కు క‌రోనా తీవ్ర‌త‌ను అంచ‌నా వేసింది సీఈసీ. షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని రాజకీయ‌పార్టీలు అన్నీ కోరాయి.

2024సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్ గా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నందున కొత్త నిబంధ‌న‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. యూపీలో 403నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 2017లో ఏడు విడ‌త‌ల్లో యూపీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. పంజాబ్ లో 117అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గోవాలో 40అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌రాఖండ్ లో 70అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌ణిపూర్ లో 60అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మే 14తో యూపీ అసెంబ్లీ ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. కోవిడ్ సేఫ్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని సీఈసీ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement