Friday, January 21, 2022

బాల‌య్య ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఓటీటీలో అఖండ స్ట్రీమింగ్‌ 14న కాదట

డిస్నీప్ల‌స్‌ హాట్ స్టార్ లో జ‌న‌వ‌రి 14న స్ట్రీమింగ్ అవుతుంద‌ని తొలుత స‌మాచారం అందించిన ఆ సంస్థ‌.. బాల‌య్య ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పింది. అయితే.. సినిమా రిలీజ్‌కు ముందే అఖండ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కుల్ని డిస్నీప్ల‌స్‌ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం 20 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. కేవలం ఓటీటీ హక్కులకు అంత భారీ మొత్తం వెచ్చించడం మామూలు విషయం కాదంటున్నారు సినీ అన‌లిస్టులు.

అయితే.. అఖండ OTT స్ట్రీమింగ్ పార్టనర్, డిస్నీప్ల‌స్‌ హాట్‌స్టార్ జనవరి 21 నుండి ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కోసం సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. “హాయ్! అఖండ 21 జనవరి, 2022న ప్రీమియర్‌గా ప్ర‌ద‌ర్శ‌న‌కు అందుబాటులో ఉంటుంద‌ని మీకు తెలియజేసేందుకు సంతోషిస్తున్నాము. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి అంటూ డిస్నీప్ల‌స్‌ హాట్‌స్టార్ ట్వీట్ చేసింది. అయితే 14న ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తుండగా మరో వారం లేట్ కావ‌డంతో బాల‌య్య ఫ్యాన్స్ నిరుత్సాహ‌ప‌డుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News