Thursday, May 2, 2024

Breaking: అమ్మాయిలను అమ్మకానికి పెట్టిన ‘బుల్లి బాయి’.. పోలీసుల ట్రాకింగ్..

హైదరాబాద్ నగరానికి చెందిన జర్నలిస్టు, రీసెర్చర్ ని ఆన్‌లైన్‌లో వేధింపులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఆమె వివరాలను ‘బుల్లీ బాయి’ అనే యాప్‌లో పోస్ట్ చేసినట్టు ఫిర్యాదు అందుకున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేసిన మహిళ ఫొటో ఇతర వివరాలతో యాప్ లో పోస్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ యాప్‌లో ముస్లిం మహిళల ఫొటోలను పోస్ట్ చేస్తూ, వాటిని వేలానికి ఉంచినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇంతకుముందు ‘సుల్లి డీల్స్’ అనే యాప్ ద్వారా కూడా ఇలాగే చేశారని పేర్కొన్నారు. కాగా, యాప్ ద్వారా ఆన్‌లైన్ వేధింపుల సమస్యను జర్నలిస్ట్ ట్విట్టర్‌ ద్వారా పోలీసులకు కంప్లెయింట్ చేశారు.

‘‘నా ఫొటోను పోస్టు చేస్తూ.. నన్ను ఎవరో వేలం వేశారని తెలుసుకుని ట్విట్టర్ నుంచి తప్పుకున్నాను”అని ఆమె పోలీసులకు తెలిపింది. పలువురు ముస్లిం మహిళల ఫొటోలు ‘బుల్లీ బాయి’ అనే యాప్‌లో ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ GitHub‌లో అప్‌లోడ్ చేశారని తెలిపిం. ఈ అంశంపై నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్‌, డీజీపీ మహేందర్‌రెడ్డికి దీనిపై రిక్వెస్ట్ చేశారు.“ఇట్లాంటి ఘటనలను సీరియస్ గా తీసుకోవలి.. దీనికి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే సరిపోదు. ఇలా మహిళలను కించపరుస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని అరెస్టు చేయాలి. వారికి సరైన బుద్ధి చెప్పాలి’’ అని ఒవైసీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇప్పటికే హైదరాబాద్ సిటీకి చెందిన ఓ బాధితుడి నుండి వచ్చిన ఆన్‌లైన్ ఫిర్యాదును కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. యాప్‌ను రూపొందించి, దాన్ని నిర్వహిస్తున్న వ్యక్తులను ట్రాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకొంతమంది బాధితుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు రావడంతో న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement