Saturday, April 20, 2024

కుయ్ కుయ్ అంటలేవ్.. 108 అంబులెన్స్ లు కనిపిస్తలేవ్..

ఆపదలో ఉన్న వారిని సకాలంలో ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలను నిలిపే 108 వాహనాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతం మొదలు… పట్టణాల్లోని పేద, ధనిక అనే భేదం లేకుండా ఎవరూ ఫోన్‌ చేసినా నిమిషాల్లో వచ్చి ఆదుకుంటాయి 108 వాహనాలు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌ సేవలు అవసరమౖయ్యే రోగుల సంఖ్య పెరుగుతుండగా… అందుకు తగిన సంఖ్యలో అంబులెన్స్‌లు అందు బాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ఫోన్‌ చేసిన నిమిషాల్లోనే కుయ్‌ కుయ్‌ అంటూ అంబులెన్స్‌ వస్తుందన్న భరోసా ఇప్పుడు లేదు.
ప్రమాదానికి గురైన తర్వాత ప్రతీ క్షణం ఎంతో విలువైంది. అయితే ఆ విలువైన క్షణాల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించే108 వాహనాలు తగినన్ని సంఖ్యలో అందుబాటులో లేకపోవడంతో ఎన్నో కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయి రోడ్డున పడుతున్నాయి.

హైదరాబాద్‌లో సమస్య మరింత తీవ్రం…
రాష్ట్ర వ్యాప్తంగా 108 వాహనాలకు తీవ్ర కొరత నెలకొనగా…. ప్రత్యేకించి హైదరాబాద్‌లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రతి 5 కి.మీకు ఒకటి, నగర శివార్లలో 25 కి.మీ. ఒక 108 అందుబాటులో ఉంది. అయితే నగరంలోని అంబులెన్స్‌ను ఆస్పత్రుల నుంచి వేరే ఆస్పత్రికి రిఫరల్‌ కేసుల తరలింపుకే ఎక్కువగా వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రమాద సమయాల్లో క్షతగాత్రులను కాపాడేందుకు 108 వాహనాల కొరత నగరంలో రోజు రోజుకు తీవ్ర మవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement