Saturday, April 27, 2024

Spl Story | తెలంగాణలో బోనాల జోష్​.. జులై నుంచి పండుగలే పండుగలు!

జులై నెల ఎన్నో పండుగలు, వ్రతాలకు ప్రసిద్ధిచెందింది.  తెలంగాణ బోనాలు, గురుపూర్ణిమ, బక్రీద్ తో పాటు ఎన్నో పండుగలు వస్తున్నాయి. ఈ నెలలోనే చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. అలాగే దేవశయని ఏకాదశి నుంచి దేవతలు 4 నెలలు నిద్రిస్తారని పండితులు చెబుతారు. అనంతరం నాలుగు నెలల తర్వాత వచ్చే ఏకాదశి నుంచి శుభకార్యాలు ప్రారంభమవుతాయి.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఇక.. హైదరాబాద్​లోని గోల్కొండ కోట నుంచి బోనాల ఉత్సవాలు షురూ అవుతాయి. జూన్​ 22వ తేదీన తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించారు. ఆ తర్వాత సికింద్రబాద్, లాల్ దర్వాజ బోనాలు ఉంటాయి. ఆషాఢ మాసంలో జరుపుకునే తొలి పండుగ ఇదే. ఈ సమయంలో ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. అంటే ఆ తల్లికి సమర్పించే నైవేద్యం. మహిళలు ఇంట్లో వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం వంటి వాటితో బోనాన్ని మట్టి లేదా రాగి కుండల్లో తలపై పెట్టుకుని డప్పు కోలాహాలతో గుడికి వెళ్తారు.  

ఈ ఏడాది జులైలో పండుగల జాబితా..

  • జయ పార్వతి వ్రతం: జులై 1, 2023 (శనివారం)
  • గురు పూర్ణిమ: జులై 3, 2023 (సోమవారం)
  • మంగళ గౌరీ వ్రతం / పూజ: జులై 4, 2023 (మంగళవారం)
  • శ్రావణ సోమవార వ్రతం: జులై 4, 2023 (మంగళవారం)
  • సంకష్టి చతుర్థి: జులై 6, 2023 (గురువారం)
  • కాలాష్టమి: జులై 9, 2023 (ఆదివారం)
  • శ్రావణ సోమవార వ్రతం: జులై, 10 2023 (సోమవారం)
  • కేర్ పూజ: జులై 11, 2023 (మంగళవారం)
  • మంగళ గౌరీ వ్రతం / పూజ: జులై 11, 2023 (మంగళవారం)
  • ప్రదోష వ్రతం: జులై 15, 2023 (శనివారం)
  • సావన్ శివరాత్రి: జులై 15, 2023 (శనివారం) – జులై 16, 2023 (ఆదివారం)
  • కర్క సంక్రాంతి: జులై 16, 2023 (ఆదివారం)
  • బోనాలు పండుగ: జులై 17, 2023 (సోమవారం)
  • శ్రావణ సోమవార వ్రతం: జులై 17, 2023 (సోమవారం)
  • హరియాళీ అమావాస్య: జులై 17, 2023 (సోమవారం)
  • దర్శ అమావాస్య: జులై 17, 2023 (సోమవారం)
  • చంద్ర దర్శనం: జులై 19, 2023 (బుధవారం)
  • వినాయక చతుర్థి: జులై 21, 2023 (శుక్రవారం)
  • ఆండాళ్ జయంతి / ఆదిపూరం: జులై 22, 2023 (శనివారం)
  • గురు హరికృష్ణ జయంతి: జులై 23, 2023 (ఆదివారం)
  • మొహర్రం: జులై 29, 2023 (శనివారం)
Advertisement

తాజా వార్తలు

Advertisement