Sunday, May 5, 2024

అంబులెన్స్ లో బాలీవుడ్ స్టార్ షారుక్

ముంబైలో షూటింగ్ లో పాల్గొన్నారు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్. అంబులెన్స్ లో షారుక్ కూర్చొని ఉండ‌గా ఆయ‌న చుట్టూ సిబ్బంది ఉన్నారు.. ఇందులో షారుక్‌ మొహం కవర్‌ చేసి ఉంది. దీంతో ఇది ఏ మూవీ షూటింగ్‌ అయ్యింటుందని ఫ్యాన్స్‌ ఆరా తీస్తున్నారు. అయితే దీనికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ ఇది డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్‌ ఖాన్‌ ‘లయన్‌’ మూవీ సెట్‌లోనిది అయ్యింటుందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈ ఫొటోను షేర్‌ చేస్తూ అట్లీ, లయన్‌ పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ను వైరల్‌ చేస్తున్నారు. లయన్‌ మూవీలో షారుక్‌ సరసన సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది 2021లో ఈ మూవీ సెట్స్‌పైకి రాగా పలు సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్‌ను జరుపుకుంది. ఈ క్రమంలో షారుక్‌ పఠాన్‌ షూటింగ్‌, నయన తారా బిజీ షెడ్యుల్‌ కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. అయితే షారుక్‌ స్పెయిన్‌ నుంచి తిరిగి రావడం, హీరోయిన్‌ నయన తార ఏప్రిల్‌ 6న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ‘లయన్‌’ మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement